MDCL: ఆరోగ్య వారం సందర్భంగా అల్వాల్ పీహెచ్సీ నుంచి ఇందిరా గాంధీ కూడలి వరకు అవగాహన వాక్ థాన్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ ఉమా గౌరి, డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, డాక్టర్ శ్రీకాంత్ పాల్గొని హెచ్ఐవి రహిత తెలంగాణే లక్ష్యమని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్న ఈ ర్యాలీలో వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.