MHBD: జిల్లాలో గంజాయి సమాచారం అందించిన వారికి రూ.5వేల బహుమతి అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రకటించారు. యువత ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తు కాపాడడానికి గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి వినియోగదారులు లేదా సరఫరా చేసే వ్యక్తుల వివరాలు 9712657999 నెంబర్కి సమాచారం అందించాలన్నారు.