నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక యాక్షన్ ఫాంటసీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని 2026 మే 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మే 15 లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.