MBNR: కార్పొరేషన్ పరిధిలోని వీధి చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు డిమాండ్ చేశారు. సీపీఐ ప్రచార యాత్రలో మాట్లాడుతూ.. వ్యాపారుల పై అధికారుల వేధింపులు పెరిగాయని, కనీస వసతులు లేవని తెలిపారు. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిందని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.