వనపర్తి మున్సిపాలిటీలో విలీనమైన పల్లెలకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలని శ్రీనివాసపూర్ మాజీ ఉపసర్పంచ్ ఉమ్మల్ల రాములు ఎంపీ మల్లు రవికి వినతిపత్రం ఇచ్చారు. రాజనగరం, నాగవరం, నర్సింగాయపల్లి, శ్రీనివాసపూర్ గ్రామాల్లో పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.