MNCL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం 3.15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రినోవేషన్ పనులను పరిశీలిస్తారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులకు క్రీడలకు సంబంధించిన కిట్లు పంపిణీ చేయనున్నారు.