BPT: అటవీ, పర్యావరణ చట్టాల అమలులో రాజీ ఉండకూడదని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. చీరాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో మత్స్యకారుల జీవనాధారాన్ని దెబ్బతీయొద్దన్నారు. తీర ప్రాంతాల్లో రిసార్ట్లు, లేఔట్లకు అనుమతులు ఇవ్వడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. నియమాల ఉల్లంఘన ప్రమాదకరమని హెచ్చరించారు.