పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగు పడింది. ఈ నెల 10న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ట్రంప్ ప్రకటించిన 14 రోజుల గడువులోపే ఈ చర్చలు సఫలమైతే, యుద్ధ భయాందోళనలకు తెరపడే అవకాశం ఉంది.