AKP: మాడుగులలో ఈ నెల 13న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగనుందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ తెలిపారు. రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ క్యాంటీన్‌ను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా పాండవుల చెరువు శంకుస్థాపన, జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించనున్నారని పేర్కొన్నారు.