W.G: పాలకొల్లు పట్టణంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల తాతాజీలు వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులుగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.