AP: రాజమండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో కలకలం సృష్టించిన కల్తీ పాల ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, గణేష్ అస్వస్థకు గురయ్యాడు. రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కల్తీ పాలు తాగి మరో మహిళ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.