PM Modi: Then BRS.. Now Congress is looting the state
PM Modi: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని మోదీ విమర్శించారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నాయని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని మోదీ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందన్నారు.
మోదీ గ్యారంటీ అంటే దేశ అభివృద్ధికి గ్యారంటీ, విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, ఇచ్చిన హామీలు నెరవేరతాయన్న గ్యారంటీ అని అన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ రాకుమారుడు విద్వేష విషం చిమ్ముతున్నారు. రాజగురువు కదా మనల్ని శరీర రంగు ఆధారంగా విభజిస్తున్నారు. శరీర రంగును బట్టి దక్షిణ భారత్ వాళ్లు ఆఫ్రికన్లు అని మాట్లాడారు. కాంగ్రెస్కు హిందువులు అన్న వాళ్ల పండుగలు అన్న ఇష్టం లేదు. కులాలు, మతాలు పేరుతో దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని మోదీ అన్నారు.