Gold rate decreased by more than 3000 last 10 days india
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. గత రెండు రోజులుగా పసిడి రేట్లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. శనివారం మాత్రం స్వల్పంగా పెరిగాయి. నేడు రూ.168 పెరిగిన 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.74,619కి చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ..74,619గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. నేడు రూ.190 తగ్గి రూ.83,395 కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం స్వల్పంగా పెరగడం, వెండి స్వల్పంగా తగ్గడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర దాదాపుగా స్థిరంగా ఉంది. శనివారం నాలుగు డాలర్ల మేర పెరిగి 2337 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే ఔన్సు వెండి ధర 2725 డాలర్లుగా ఉంది.