వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూ సంగీతం అందిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. అయితే ఈ సినిమా కోసం DSPను ఎంపిక చేసుకోవడంపై వేణు స్పందించాడు. కథా గమనానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ పాత్రకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్, కథలోని సహజత్వం, భావోద్వేగాలను పండించడానికి DSPనే పర్ఫెక్ట్ అని అన్నాడు. సినిమా స్పాన్ పెరగడంతో ఈ మార్పు చేసినట్లు తెలిపాడు.