కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1397.91 అడుగుల మేరకు 9.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ సాకేత్ తెలిపారు. మొత్తం 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు) సామర్థ్యానికి గాను, 1397 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం నీటి విడుదలను 1000 క్యూసెక్కులకు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు.