శర్వానంద్ ‘బైకర్’ మూవీపై అక్కినేని నాగార్జున ప్రశంసలు కురిపించారు. ‘బైకర్ కుటుంబ భావోద్వేగాలను, బంధాలను అత్యంత సుందరంగా ఆవిష్కరించే ఒక అద్భుతమైన సినిమా. ఇందులోని రేసింగ్ సన్నివేశాలను, క్లైమాక్స్‌ను అస్సలు మిస్ అవ్వకండి. దర్శకుడు అభిలాష్ పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.