దర్శకుడు ఓంరౌత్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై అజయ్ దేవగణ్ టీమ్ తాజాగా స్పందించింది. ఓంరౌత్ దర్శకత్వంలో అజయ్ సినిమా చేస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం అజయ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని వెల్లడించింది.