TG: గ్రూప్-1 నియామకాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.