HYDలోని సైఫాబాద్‌లో ఒకే బైక్‌పై ఐదుగురు ప్రయాణించి ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మార్చి 29 అర్ధరాత్రి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ వైపు హెల్మెట్ లేకుండా ప్రమాదకరంగా వెళ్తున్న వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.