KDP: సమాజంలో ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలని NSS కోఆర్డినేటర్ గౌరీశంకర్ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మై భారత్ కేంద్ర ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు సేవించడం ద్వారా సమాజంలో విలువలను కోల్పోతారని విద్యార్థులకు సూచించారు.