PDPL: జిల్లాస్థాయి రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో విజేతలకు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ బహుమతులు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో చదవడం, కథలు చెప్పడం వంటి అంశాలలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 14 మండలాల నుంచి 22 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఈవో శారద, అధికారులు పాల్గొన్నారు.