ATP: అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం పట్ల జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాజధానికి భరోసా దక్కిందన్నారు. అభివృద్ధిని ఓర్వలేక జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.