నంద్యాల ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని మున్సిపల్ హైస్కూల్‌ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి స్వయంగా భోజనం చేసిన మంత్రి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవడాన్ని గమనించిన ఆయన, భోజన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.