KDP: నెట్వర్క్ హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, తద్వారా సామాన్య, పేద ప్రజలకు వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని కడప CPM నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బకాయిలు చెల్లించకపోవడం వల్ల వైద్య సేవలు ఆగిపోయాయన్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.