MNCL: ఈ నెల 4న క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ పరిశీలకులుగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ను పార్టీ అధిష్టానం నియమించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లను సమన్వయపర్చి పదవులు కైవసం చేసుకునే బాధ్యతను పరిశీలకులకు అప్పగించారు. గత ఫిబ్రవరి 17న చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది.