‘యుగానికి ఒక్కడు 2’ సీక్వెల్‌పై హీరోయిన్ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నా నుంచి యుగానికి ఒక్కడు-2 ఆశించవద్దు. ఆ సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో నేను ఉండను. ఎందుకంటే సెల్వరాఘవన్‌తో పనిచేయడం చాలా కష్టం. మొదటి భాగం కోసం మేము ఏకంగా 200 రోజులు షూటింగ్లో పాల్గొన్నాము’ అని చెప్పింది. కానీ ఆ సినిమా తర్వాత తను చేసిన ఏ పాత్రనైనా సులభంగా చేయగలిగానని పేర్కొంది.