MBNR: హనుమాన్ జయంతి పురస్కరించుకొని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పట్టణంలోని పలు హనుమాన్ దేవాలయాలను సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం నిమ్మాబాయి గడ్డలో ఘనంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.