AP: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇకపై రాజధాని అమరావతి అజేయమని, ఏపీ ప్రజలంతా సంబరాలు చేసుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.