TPT: రాజధాని రాష్ట్రానికి హృదయం లాంటిదని ప్రిన్సిపాల్ డా. బి. చంద్రమౌళి అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్ణయించడం ఆనందకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో రాజధాని ప్రాముఖ్యతపై చర్చించారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.