కోనసీమ: ఉండూరులో శ్రీ మార్కండేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. రూ.1.35 కోట్లతో ఆలయాన్ని సుందరీకరించనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ చంద్రశేఖర్, సత్యం, ఏఎంసీ ఛైర్మన్ రిశ్వంత్ రాయ్ పాల్గొన్నారు.