MHBD: జిల్లా కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయింపు జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ తెలిపారు. మానుకోట పట్టణ కేంద్రంలో గురువారం సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో MLA పాల్గొని, పాపన్న చిత్రపటానికి నివాళి అర్పించారు. కోడూరు నాయకుల విజ్ఞప్తి మేరకు స్థల కేటాయింపు చేస్తానన్నారు.