KKD: ఏలేశ్వరం మండలం యర్రవరంలో విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి సమీపంలోని ప్రైవేటు లేఅవుట్లో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అదే గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.