NRML: జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ గురువారం చింతకుంటవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గుర్తించిన ఆయన, తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)తో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల ఇబ్బందులను వివరించగా, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని డీఈవో హామీ ఇచ్చారు.