WG: తాడేపల్లిగూడెం 35వ వార్డులోని హాస్టల్‌ను నిన్న మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తనిఖీ చేశారు. హాస్టల్లోని వసతులు, సదుపాయాలు, తాగునీరు, ఆహారం, పారిశుద్ధ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు కమిషనర్ ఏసుబాబు సూచించారు. శానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఏఎస్వో రజిని, శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు.