HYD: కారులో నగరం దాటి బయటకు వెళ్లి జాతీయ రహదారిపైకి వెళ్లారనుకోండి. టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్గా మీ అకౌంట్లో నుంచి డబ్బు కట్ అవుతంది. ఒకవేళ మీరు ఫాస్టాగ్ రీఛార్జ్ మరచిపోయి.. UPI పనిచేయకపోతే టోల్ గేట్ వద్ద డబ్బులివ్వవచ్చు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే టోల్ ప్లాజాల వద్ద నగదు తీసుకోవడం ఈ రోజు నుంచి రద్దైంది.