GDWL: గద్వాల, అయిజ, వడ్డేపల్లి కేజీబీవీలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ (ఇంగ్లీష్ మీడియం) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థినులు ఏప్రిల్ 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 2026లో పదో తరగతి రాసిన వారు దీనికి అర్హులు. దరఖాస్తు రుసుము రూ. 200గా నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.