NRPT: నారాయణపేట మండలం షేర్నపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్డు పనులను బుధవారం మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి ప్రారంభించారు. రూ.5 లక్షల వ్యయంతో రోడ్డు పనులు చేపట్టినట్లు చెప్పారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహకారంతో గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు.