గుంటూరు: పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా (సీఎస్ఈ) ఐఏఎస్ అధికారిణి తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కాగా, గతంలో ఆమె గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజల నుంచి మంచి మన్ననలు పొందారు.