జగిత్యాలలో రానున్న రబీ ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొనుగోలు వివరాలు వెంటనే నమోదు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేయాలని తెలిపారు. జిల్లాలో 300కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.