SS: పెనుకొండలోని సివిల్ సప్లై గోడౌన్ వద్ద ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, సీఐటీయూ మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ.. ఎంఎల్ఎస్ పాయింట్లలో హమాలీలకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడం అన్యాయమని తెలిపారు. పాత పద్ధతిలోనే బిల్లులు అమలు చేయాలని, కూలీ రేట్లు పెంచాలని కోరారు.