NLR: పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్లో గల శ్రీ గోదా సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదల ప్రకారం ఘనంగా సత్కారం అందించారు.