సత్యసాయి: ధర్మవరంలో టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సోమవారం పంపిణీ చేశారు. తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన 26 చెక్కులను అందజేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తోందని తెలిపారు.