VZM: జిల్లాలో రెవెన్యూ సేవలు, భూ సర్వే ప్రక్రియలు మరియు ప్రజల దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నిర్వహించిన ఆన్లైన్ సమీక్షలో మ్యుటేషన్ల సవరణలు, 22ఏ దరఖాస్తుల పరిష్కారం, ఫారం–8 జారీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు.