SS: నల్లమాడ మండలం గోపీపల్లి గ్రామ రైతుల దశాబ్దాల చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ ప్రత్యేక చొరవతో 125 మంది రైతులకు చెందిన 305.68 ఎకరాల భూమిని పట్టా భూములుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి సవిత చేతుల మీదుగా రైతులకు ఎన్ఓసీ కాపీలు అందజేశారు.