ASR: అనంతగిరి మండలం డొంకపుట్టు గ్రామంలో ఉపాధి పనులను గిరిజన సంఘం నాయకుడు సివేరి కొండలరావు పరిశీలించారు. ఫేస్ హాజరు విధానం వల్ల కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. హాజరు నమోదు చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కొండలరావు డిమాండ్ చేశారు.