ELR: కైకరం పంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో పైపులైన్ సమస్య కారణంగా గ్రామస్థులకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. బుధవారం డిప్యూటీ ఎంపీడీవో జి.రమేష్ బాబు, పీడీఓ సుమలత నీటి సరఫరాను స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలనా కోరారు.