TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 4న జరగనుంది. ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లకు పార్టీల వారీగా సీటింగ్.. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు.