KDP: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలనుకున్న నాలుగు లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే పిలుపులో భాగంగా కడప సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎఐటీయూసీ, సీఐటీయూ సంయుక్తంగా నిరసన చేపట్టాయి. కార్మిక హక్కులను కాపాడాలని, పాత 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ కార్మికులకు అన్యాయం చేస్తాయని విమర్శించారు.