SDPT: పౌల్ట్రీ కంపెనీల మొండి వైఖరిని నిరసిస్తూ హుస్నాబాద్ మండలంలో చికెన్ షాపుల యజమానులు నిరవధిక బంద్ చేపట్టారు. అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నుంచి అన్ని గ్రామాల్లో దుకాణాలు మూతపడటంతో మాంసం లభ్యత నిలిచిపోయింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని యజమానులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.