SDPT: యాసంగి (2025-26) సీజన్లో వరిధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో అధికారులు, మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పౌర సరఫరాలు, సహకార శాఖలు సమన్వయంతో చూడాలన్నారు.